ఆ విషయంలో అనసూయ సీరియస్?

ఆ విషయంలో అనసూయ సీరియస్?

పద్దతిగా వుందామన్నందుకు ఫైర్ అవుతోన్న యాంకర్ అనసూయ?

షల్ మీడియా వల్ల సెలబ్రెటీలకు మంచి ప్రచార వేదిక లభించిన మాట వాస్తవం. అదే సమయంలో దాని వల్ల దుష్పరిణామాలూ లేకపోలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా విధ్వేషం కక్కే జనాలకూ అక్కడ లోటుండదు. సెలబ్రెటీ లేడీస్ కు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సామాజిక మాధ్యమాల్లో వారు దారుణమైన మాటలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐతే ఇలాంటివి మామూలే అనుకుని చాలా వరకు సర్దుకుపోతుంటారు అమ్మాయిలు. కానీ కొన్నిసార్లు అవతలి వాళ్లు మరీ శ్రుతి మించిపోతే వీళ్లకు మండిపోతుంది. ఆగ్రహం పట్టలేక ఫైర్ అయిపోతుంటారు. యాంకర్.. నటి అనసూయ కూడా అదే చేసింది. జబర్దస్త్ ప్రోగ్రాంలో తన డ్రెస్సింగ్ గురించి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్లు చేసేసరికి అనసూయ తట్టుకోలేకపోయింది. ఇలాంటి ప్రోగ్రాంలో అలా ఎక్స్ పోజింగ్ చేస్తే తాము ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రాం ఎలా చూడాలంటూ అనసూయను ప్రశ్నించాడు నెటిజన్. దీనికి ఆమె బదులిస్తూ.. అంత ఇబ్బందిగా ఉంటే నీకు ఛానెల్ మార్చుకునే స్వేచ్ఛ ఉన్నపుడు ఇలా కామెంట్లు చేయడం దేనికి అని ప్రశ్నించింది. ఆయా కార్యక్రమాల్ని ప్రమోట్ చేయడం తమ బాధ్యత అని.. దానికి తగ్గట్లుగా డ్రెస్ వేసుకుంటామని.. అంత మాత్రాన ఇలాంటి కామెంట్లు చేస్తారా అని ప్రశ్నించింది. తాను ఒక కుటుంబాన్ని నడుపుతున్న మహిళనని.. భార్యగా.. తల్లిగా ఉన్నానని.. మహిళల్ని చూసే దృష్టి మారాలని అనసూయ అంది. పసి పిల్లల నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ల వరకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. కేవలం అమ్మాయిల డ్రెస్సింగ్ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నట్లు మాట్లాడటం సబబు కాదని అనసూయ అభిప్రాయపడింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *