హీరోయిన్ సాయిపల్లవి రెమ్యూనరేషన్?

హీరోయిన్ సాయిపల్లవి రెమ్యూనరేషన్?

ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసేసింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటి. ‘బాడ్కావ్ బలిసిందారా… బొక్కలిరగ్గొడతా’ అంటూ తెలంగాణ యాసతో తాను తప్ప మరెవరు చేయలేరు అన్నంత ఈజీగా పాత్రని పండించింది సాయిపల్లవి. లి సినిమాలోన తన నటనతో మంచి మార్కులు సాధించి వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. బలమైన కథా కథనాలను కలిగిన ఫిధా సినిమాను ఆమె అంతా తానై ముందుకు నడిపించింది. అలాంటి సాయి పల్లవికి భారీ పారితోషికమే ముట్టజెప్పి వుంటారని అనుకోవడం సహజం. అయితే ఈ సినిమాకి గాను ఆమె అందుకున్న మొత్తం 25 లక్షలు మాత్రమేనట. ఈ సినిమా తరువాత నుంచి మాత్రం ఆమె తన పారితోషికాన్ని 70 లక్షలకి పెంచిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. ‘ఫిదా’లో భానుమతి పాత్ర తనకి తీసుకొచ్చిన క్రేజ్ కారణంగా, ఆ స్థాయిలో నటనకి అవకాశం వుండే పాత్రలకే సాయిపల్లవి ప్రాధాన్యతను ఇస్తోందట. మున్ముందు సాయిపల్లవి మరింతగా ప్రేక్షకులను కట్టిపడేయనుందన్న మాట.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *