‘పైసా వసూల్’ మూవీ రివ్యూ

‘పైసా వసూల్’ మూవీ రివ్యూ

సినిమా : పైసా వసూల్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రీయ,ముస్కాన్, కైరా దత్, కబీర్ బేడీ, అలీ, పృథ్వీ, విక్రమ్ జీత్ తదితరులు..
సినిమాటోగ్రఫి : ముఖేష్. జి
ఎడిటర్ : జునైద్ సిద్ధిక్
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్
దర్శకుడు : పూరీ జగన్నాధ్
విడుదల : 1 సెప్టెంబర్, 2017
రేటింగ్ : 3.5 / 5

బసవరామ తారక పుత్ర నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో 100 చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్’. పూరీ జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. సింహా, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య నటించిన ‘పైసా వసూల్’ చిత్రం మాస్, మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రియసరన్, ముస్కన్ సేథి, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం..

కథ :
ఇందులో గొప్ప మలుపులూ, సరికొత్త మెరుపులూ లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక జేమ్స్ బాండ్ లాంటి కథ లాంటిది. తేడా సింగ్ అనేవాడు తేడా తేడా గా బిహేవ్ చేస్తూ అందరి దృష్టిలో పడతాడు. చాలా డేరింగ్ డాషింగ్ గా ఎవరితోనైనా తలపడుతుంటాడు. బాబ్ మార్లో అనే ఇంటర్నేషనల్ డాన్ ని తుదముట్టించడం కోసం ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటుంది. ఆ టాస్క్ కోసం తేడా సింగ్ ని ఉపయోగించుకోవాలని చూస్తుంది. మరి తేడా సింగ్ ఆ టాస్క్ ఒప్పుకున్నాడా? ఇంతకూ తేడా సింగ్ ఎవరు? ఎందుకింత తేడా గా బిహేవ్ చేస్తుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘పైసా వసూల్’ చిత్రం తప్పకుండా వెండితెర పై చూడాల్సిందే.

నటీనటుల గురించి :
సినిమాలు హిట్స్ కావచ్చు లేక్ ఫ్లాప్ కావచ్చు.కాని నటన పరంగా బాలకృష్ణ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. దానికి ఈ “పైసా వసూల్” మినహాయింపేమీ కాదు.ఒక్క మాటలో చెప్పాలంటే పూరి మార్కు హీరో పాత్రలో బాలయ్య నటన అభిమానులతో ఈలలు వేయించడం ఖాయం,అభిమానులు కాని వాళ్ళను కూడా అలరించడం ఖాయం.బాలకృష్ణ ‘తేడా సింగ్’ గా చాలా బాగా చేసాడు. ఆయన ఇప్పటివరకూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు కూడా.పేరుకి తగ్గట్టుగానే తేడా తేడా గా నటిస్తూ తేడా సింగ్ పాత్రలో బాలకృష్ణ బ్రహ్మాండం గా ఒదిగిపోయారు. శాతకర్ణి గా రాజసం చూపించింది ఈయనేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రియ , ముస్కాన్ , కైరా దత్ లు ఉన్నంతలో పర్వాలేదనిపించారు. కబీర్ బేడీ, విక్రంజీత్ లు ఆయా పాత్రల్లో ఫ్రెష్ గా అనిపించారు.ఆలీ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం గురించి :
ఈ మధ్య కాలంలో పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన సినిమాలలో ఎక్కువశాతం బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి.అతని చివరి సినిమా “రోగ్” అయితే మరీ దారుణంగా కనీస స్థాయి బిజినెస్ కూడా జరగని పరిస్థితి.అవన్నీ దృష్టిలో పెట్టుకునే పూరి ఈ సినిమా విషయంలో జాగ్రత్తపడ్డాడనిపిస్తుంది. ఎక్కడా తడబాటు లేకుండా తన మార్క్ స్పీడ్ టేకింగ్ తో సినిమా ని చక చక పరుగెత్తించాడు. తన అంబుల పొది లో ప్రధాన అస్త్ర మైన హీరో క్యారక్టర్యజేషన్ , ఆటిట్యూడ్ నే మళ్ళీ నమ్ముకొని ఈ సినిమా తీసాడు. బాలకృష్ణ ను ఇలా చూపించొచ్చని ఎవరూ ఊహించని విధంగా తీసాడు. ముఖేష్ ఫోటోగ్రఫీ , ఈ సినిమా కి మంచి ఎస్సెట్. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమా కి మెయిన్ పిల్లర్. పాటలన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ క్యారక్టర్యజేషన్
బాలకృష్ణ డైలాగ్స్
బాలకృష్ణ ఎన్టీఆర్ లా వేసిన స్టెప్స్
పూరి మార్క్ హీరోయిజం
ముకేశ్ ఫోటోగ్రఫీ
అనుప్ సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
పూరి డైరెక్షన్.

మైనస్ పాయింట్స్ :
పక్కా పూరి మార్క్ సినిమా లా అనిపించే రొటీన్ కథ కావడం.
కామెడీ పెద్దగా పండకపోవడం.

విశ్లేషణ :
ఇందులో మొట్టమొదట గా చెప్పుకోవాల్సింది మాత్రం నటసింహం నందమూరి బాలయ్య గురించే ఎందుకంటే ఇలాంటి కథ ని ఒప్పుకోవటమే ఆయన దైర్యానికి నిదర్శనం గా భావించవచ్చు.ఒకసారి ఆయన ఒక డైరెక్టర్ ని నమ్మాడు అంటే ఎంతగా నమ్ముతాడో ఈ సినిమా చూస్తె అర్ధం అవుతుంది.పూరి మార్క్ హీరో లా మారిపోయాడు బాలయ్య.ఎంతో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న కాంబినేషన్.పూరి మార్క్ డైలాగ్స్ బాలయ్య డైలాగ్ డెలివరీ తో మరింత పదును గా బయటకు వచ్చాయి.మరీ ముఖ్యం గా చెప్పుకోవాల్సింది మాత్రం బాలయ్య ఎనర్జీ నే.ఈ వయసులో బాలయ్య నూనుగు మీసాల వయసు హీరో లా చెలరేగిపోయాడు.ఇక ఫైట్స్, యాటిట్యూడ్,డాన్స్,ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాల్లో మరో కొత్త బాలయ్య ని చూస్తారు. ముకేష్ ఫోటోగ్రఫీ తో ఆదరకొడితే,కైరా దత్, ముస్కాన్, శ్రీయ లు తమ అందం తో ఆకట్టుకున్నారు.మరీ ముఖ్యం గా చెప్పుకోవాల్సింది అనుప్ రూబెన్స్ సంగీతం గురించి సినిమా విడుదల కు ముందే పాటలతో సినిమా ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళిన అనుప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా కి ఒక మెయిన్ పిల్లర్ గా మారిపోయారు.బాలయ్య మొట్టమొదటిసారి గా పాడిన “మావా ఏక్ పెగ్ లా” అయితే ఏంటి తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమా “జీవిత చక్రం” నుంచి రీమిక్స్ చేసిన “కంటి చూపు చెబుతోంది” పాట అయితే ఏంటి,మెలోడీ “కన్ను కన్ను కలిసే” అయితే ఏంటి బాలయ్య-మణి శర్మ కాంబినేషన్ ని గుర్తు చేసాడు అనుప్.ఇన్ని చెప్పుకున్న మనం పూరి దర్శకత్వ ప్రతిభ చెప్పుకోవాలి. ఎలాంటి హీరో అయినా తనదైన మార్క్ సినిమా లు తియ్యడం పూరి ప్రత్యేకత.ఈ సినిమా కూడా పూతి స్థాయి పూరి సినిమా లాగే తెరకెక్కించడం లో పూరి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.ముఖ్యం గా ఈ సినిమా కి బాలయ్య మొదటి పిల్లర్ కాగా,పూరి రెండవ పిల్లర్,అనుప్ మూడో పిల్లర్ కాగా,ఆనంద్ ప్రసాద్ నాలుగో పిల్లర్.సింపుల్ గా చెప్పాలంటే బాలయ్య బాబు వన్ మాన్ షో…

ఫైనల్ గా చెప్పాలంటే…
నిజంగా ఇది బాలయ్య బాబు వన్ మాన్ షో ‘పైసా వసూల్’.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *