‘పి.ఎస్.వి గరుడ వేగ’ నెం.1 ఇన్ ట్రేండింగ్

సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ లు పలుకుతున్న ‘పి.ఎస్.వి గరుడ వేగ’ నెం.1 ఇన్ ట్రేండింగ్

యాంగ్రీ యంగ్ మాన్, విలక్షణ నటుడు డా రాజశేఖర్ నటిస్తున్న సినిమా పి.ఎస్.వి గరుడ వేగ. శివాని శివాత్మిక మూవీస్ సమర్పిస్తుండుగా, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు గ్రహిత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా ఏం. కోటేశ్వర్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య విడుదల అయిన ఈ సినిమా టిజర్ సోషల్ మీడియా లో అతి తక్కువ వ్యవధి లో మూడు మిలియన్ లకు (3M) పైగా వీక్షించిన టిజర్ గా రికార్డ్ సృష్టించి నెం.1 ట్రేండింగ్ లో గత రెండు రోజులుగా కొనసాగుతుంది. అద్భుతమైన కథ, అత్య అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు హైలి హాలీవుడ్ టెక్నికల్ వ్యాల్యుస్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ ఫేమస్ స్టార్ సన్నీ లియోన్ ఒక ప్రత్యేక సాంగ్ కి స్టెప్ లు వేయడం మరొక ఆకర్షణ.

రాజశేఖర్ కి సరిజోడి గా విశ్వరూపం ఫేం పూజా కుమార్ నటిస్తుండగా, కిషోర్, ఆలి, శ్రద్దా దాస్, నాజర్, అవసరాల శ్రీనివాస్, పృథ్వి మరియు ఇతర భారి తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం శ్రీ చరణ్ పాకాల మరియు భిమ్స్, సినిమాటోగ్రఫీ అంజి, గికా చేలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ రగుతు, శ్యాము, ఏడిటింగ్ ధర్మేంద్ర కాకరాల. భారి అంచనాలతో అతి త్వరలో మన ముందుకు రానున్న ఈ సినిమాకు నిర్మాత కోటేశ్వర్ రాజు, రచన దర్శకత్వం ప్రవీణ్ సత్తారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *