‘స్పైడర్’ మూవీ రివ్యూ

‘స్పైడర్’ మూవీ రివ్యూ

సినిమా : ‘స్పైడర్’
నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, ఎస్‌జె సూర్య, భరత్, ప్రియదర్శి తదితరులు
సినిమాటోగ్రఫి : సంతోష్ శివన్
సంగీతం : హారీస్ జయరాజ్
నిర్మాత : ఎన్వీ ప్రసాద్
దర్శకుడు : ఏఆర్ మురుగదాస్
విడుదల : 27 సెప్టెంబర్ 2017
రేటింగ్ : 3.75 / 5

మ‌హేష్‌బాబు మురుగ‌దాస్ సినిమా అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు స్టార్ట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త యేడాదిగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ఈ రోజు తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మ‌హేష్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో పాటు రూ.157 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో స్పైడ‌ర్ క్రేజ్ స్కై రేంజ్‌లో ఉంది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

కథ గురించి చెప్పాలంటే :
ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ శివ(మహేష్ బాబు). మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. కాల్ ట్రేసింగ్ ద్వారా అసాంఘిక కార్యక్రమాలను, సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటాడు. ఇలా కొనసాగుతున్న శివ జీవితంలోకి ఓ అమ్మాయి(రకుల్ ప్రీత్‌సింగ్) ఎంట్రీ ఇస్తుంది. రకుల్‌ను శివకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు ఇంటి సభ్యులు. కానీ ఎలాంటి పరిచయాలు లేకుండా బ్లైండ్ డేట్‌ ద్వారా ప్రేమించి పెళ్లిచేసుకోవాలని అనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివ.. రకుల్ కాల్ ట్రేస్ చేసి.. ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇదిలా జరుగుతుండగానే తన ఆనందం కోసం జనాలను హత్య చేసే వ్యక్తి భైరవుడు (ఎస్.జె.సూర్య). ఆ తర్వాత ఆ వ్యక్తి చేసిన విధ్వాంసాలేంటి? దానివల్ల జరిగిన నష్టమేంటి? శివకు ఆ వ్యక్తికి మధ్య ఏం జరిగింది? మరి ఈ సమస్యను శివ ఎలా అంతమొందించాడు అనేది వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.

నటీనటులు గురించి :
‘స్పైడర్’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన ఇంటెన్సిటి యాక్టింగ్‌తో అదరగొట్టేసాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా చాలా సెటిల్డ్‌గా చేసాడు. ఒక సమస్యను పరిష్కరించడానికి ఆ ఆఫీసర్ పడే ఇంటెన్షన్‌ను మహేష్ బాగా చూపించాడు. తన డాన్సులు, ఫైట్లతో పాటు, పాత్ర మేరకు తనలోని హ్యూమర్‌ను కూడా బాగా పండించాడు మహేష్. ఇక ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించిన ఎస్‌జె సూర్య బాగా చేసాడు. ఇందులో మహేష్‌కు సూర్య గట్టి పోటీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మహేష్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ పాజిటివ్ తరహాలో వుంటుందో.. సూర్య పాత్ర కూడా అదే తరహాలో పవర్ఫుల్ నెగెటివ్ తరహాలో వుండటంతో ఇద్దరి మధ్య సరైన ఫైట్ సెట్ అయినట్లుగా అనిపిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇక క్రేజీ గర్ల్‌గా రకుల్ ప్రీత్‌సింగ్ తన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అలాగే రకుల్, మహేష్‌ల మధ్య వచ్చే సీన్లు చాలా సరదాగా వున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కేవలం పాటల కోసమే కాకుండా రకుల్ క్యారెక్టర్ సినిమాలో ఓ ముఖ్య భాగమని చెప్పుకోవచ్చు. ఇక భైరవుడు పాత్రలో ఎస్. జె. సూర్య అద్భుతంగా నటించాడు. ఎదుటివారి ఏడుపులో ఆనందం కోరుకునే వ్యక్తిగా బాగా చేసాడు. ఇక భరత్, ప్రియదర్శిలు వారి వారి పాత్రలలో బాగా చేసారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతికవర్గం గురించి :
ఇక ‘స్పైడర్’ సినిమాకు సంతోష్ శివన్ అందించిన సినిమాటోగ్రఫి మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. తనకున్న అనుభవాన్ని సంతోష్ శివన్ ఈ సినిమాలో మరోసారి చూపించాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దాడు. మహేష్ సినీ కెరీర్లో స్టైలిష్ విజువల్ ట్రీట్‌గా ‘స్పైడర్’ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సంతోష్ శివన్ సినిమాటోగ్రఫికి హారీస్ జయరాజ్ సంగీతం ప్లస్ అయ్యింది. పాటలు విజువల్స్ పరంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేసింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మరోసారి ‘స్పైడర్’తో మరో హిట్ చిత్రాన్ని అందించాడని చెప్పుకోవచ్చు. గజిని, ఠాగూర్, తుపాకీ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మురుగదాస్ అందించిన మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘స్పైడర్’. మురుగదాస్ కథ ఇంట్రెస్టింగ్‌గా వుండటంతో పాటు పక్కా స్క్రీన్‌ప్లే‌తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను కథలో లీనం చేసే విధంగా సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లేను అద్భుతంగా డిజైన్ చేసారు. ఓవరాల్‌గా చూసుకుంటే ‘స్పైడర్’ బాగానే వుందని చెప్పుకోవచ్చు. మురుగదాస్ దర్శకుడిగా మరోసారి తన సత్తా ఏంటో చూపించాడని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా నిర్మించారు.

ప్ల‌స్‌లు :
మ‌హేష్ యాక్టింగ్‌, డైరెక్ష‌న్‌, ఎడిటింగ్‌, నేప‌థ్య సంగీతం, సెకండాఫ్‌…

మైన‌స్‌లు :
రొటీన్‌లైన్‌, కామెడీ లేక‌పోవ‌డం, ఏ క్లాస్ క‌థ‌నం, ప్లాట్ న‌రేష‌న్‌…

ఫైనల్ గా చెప్పాలంటే :
‘స్పైడర్’ సినిమా ఒక ఇంటెన్సిటితో కూడుకున్న థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో మహేష్ ఎంట్రీని చాలా స్టైలిష్‌గా చూపించారు. ఫస్ట్‌హాఫ్‌ చాలా సరదా సరదాగా కొనసాగుతూనే సినిమా మూడ్‌ను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ బాగుంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఎంటర్‌టైన్మెంట్ కాస్త తగ్గి… స్టోరీ పరంగా ప్రేక్షకులను ఎమోషనల్ థ్రిల్లింగ్ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. మొత్తానికి ఈ సినిమా మహేష్‌‌కు ఒక కొత్త అనుభూతి అని చెప్పుకొచ్చే కమర్షియల్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ చిత్రమే ఈ ‘స్పైడర్’.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *