నివేథా తో నవీన్ చంద్ర రొమాన్స్..!

నివేథా తో నవీన్ చంద్ర రొమాన్స్..!

ఫస్ట్ లుక్, టీజర్ తోనే తెలుగు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. ఇప్పుడు మరోసారి మ్యూజిక్ లవర్స్ ని కట్టిపడేసే పాటని విడుదల చేసింది ఆ సినిమా టీం. రతీష్ వేగ సంగీత సారధ్యంలో ప్రాణం పోసుకున్న ఈ పాటకు కరుణాకర్ అందించిన సాహిత్యం మెయిన్ హైలైట్. ‘’నీకై వేచే కనులకే రాదే రాదు అలసటే, నిను చూసాక మనసే ఏగసే’’ అంటూ ఈ మధ్య కాలంలో విననటువంటి సరికొత్తగా అనిపించే ట్యూన్ కూడా మరొక ఆకర్షణ. తన నటనాభినయంతో వరుస హిట్లు అందుకుంటున్న నివేథా థామస్ మరియు నవీన్ చంద్ర జంటగా అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనురాధ కొత్తపల్లి సమర్పిస్తుండగా కొత్తపల్లి రఘుబాబు, కే.బి చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ వద్ద పలు హిట్ సినిమాలకు సహాయకుడిగా పని చేసిన అజయ్ వోదిరాల దర్శకుడు.

ఆలి, అభిమన్యు సింగ్, తాగుబోతు రమేష్, జీవా, సుప్రిత్, గిరి, దేవన్, శ్రవణ్, రోహిణి వంటి భారీ తారాగణం నటించగా భారి బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరాన్ మరియు ఆథర్ విల్సన్. ఏడిటింగ్ ఎస్.బి ఉద్భవ్, ఆర్ట్ రాజీవ్ నాయర్, మలయాళం సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ రతీష్ వేగ సంగీతం. అజయ్ వోదిరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్దమవుతున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *