మారనున్న తెలంగాణా ముఖచిత్రం

మారనున్న తెలంగాణా ముఖచిత్రం, పలించిన మిర్యాలగూడ ఏం.ఏల్.ఏ నల్లమోతు భాస్కర్ రావు గారి కృషి.

భారతదేశం లోనే మొట్ట మొదటిసారిగా అత్యదిక విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన యాదాద్రి ధర్మల్ ప్లాంట్ ను 2015 సెప్టెంబర్ లో మన తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో శంకుస్థాపన జరిగిన విషయం తెలిసినదే. కాగా, అప్పుడు ఈ ప్రాజెక్ట్ కి కేటాయించిన 24,956 వేల కోట్ల నిధులు అన్నిరకాల అనుమతులతో సహా విడుదల అయ్యాయి.

నిర్మాణ ప్రాంతం : గ్రామము : వీర్లపాలెం, దామచర్ల మండలం, మిర్యాలగూడ నియోజకవర్గం.
నిర్మాణ అంచనా వ్యయం : 24,956 వేల కోట్లు.
విద్యుత్తు ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యం : 5 యూనిట్ల ప్లాంట్ నుండి ఒక్కొక్క యూనిట్ తరుపున 800 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, మొత్తంగా 4000 మెగావాట్లు.

విద్యుత్తు ప్లాంట్ ప్రధాన ఉద్దేశం :

1. నీటి పారుదల ప్రాజెక్ట్ లకు విద్యుత్తు సరపరా.
2. పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు.
3. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు.
4. భవిష్యత్తు తరాలకు కూడా సరిపడా విద్యుత్తు నిల్వలు.
5. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధి లో నిరుద్యోగ సమస్య లేకుండా చేయటం.
6. నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నెం.1 ప్రాంతంగా తీర్చి దిద్దటం.
7. కాలుష్య నివారణ యోచనలో అంతా విద్దుదికరణ చేయొచ్చు.

కాగా, ఈ ధర్మల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన పేద ప్రజలకు ఆ ప్రాంత ఏం.ఏల్.ఏ నల్లమోతు భాస్కర్ రావు పూర్తిగా పరిహారం చెల్లించనందు వలన మిర్యాలగూడ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ప్రాంత అభివృద్ధి కి తమ ఏం.ఏల్.ఏ భాస్కర్ రావు ఏంత గానో కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఏం.ఏల్.ఏ భాస్కర్ రావు మాట్లాడుతూ, ‘’ మా మిర్యాలగూడ నియోజకవర్గం ను రాష్ట్రం లోనే అత్యంత అభివృద్ధి కలిగిన ప్రాంతంగా తీర్చి దిద్దాలనే ఒకే ఒక్క లక్ష్యం తో నేను కాని మా క్యాడర్ గాని పని చేస్తుందన్నారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్తు కొనుగోలు చేసిన మనం ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే వేరే రాష్టాలకు విద్యుత్తును సరపరా చేసే స్థాయి కి ఏదుగుతాం అని గుర్తు చేసారు, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్తు సరపరా చేయొచ్చు అని ఆయన తెలియజేసారు.

కాగా, ఈ యదాద్రి ధర్మల్ ప్లాంట్ ని B.H .E.L మరియు Genco సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *