సరికోత్త కథ తో వస్తున్న ‘సీత.. రాముని కోసం’ టిజర్

సరికోత్త కథ తో వస్తున్న ‘సీత.. రాముని కోసం’ టిజర్

మంచి కథ, సరికోత్త కథనాలతో సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనే ధైర్యం తో తెరకెక్కిన సినిమా ‘సీత.. రాముని కోసం’. తెలుగు సిని చిత్ర సీమలో తొలిసారిగా ‘’మనిషి మరణించిన తరువాత ఆత్మ ఇంకా బ్రతికి ఉంటుందా…?, ఉంటే ఆ ఆత్మకి ఏవైనా కోరికలు ఉంటాయా…? అసలు నిజంగా ఆత్మలు కనపడతయా…? కొత్త టెక్నాలజీ తో మరణించిన వారి ఆత్మలను ఏలా చూడగలం’’ అనే సరికోత్త కథ తో, ఉత్కంటను రేపే ఫ్యామిలీ ఎమోషణ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్ శ్రీరంగం మరియు కారుణ్య చౌదరి నటి నటులుగా నటిస్తున్నారు. ఈ మధ్యే విడుదల అయిన ఈ సినిమా టిజర్ ఆడియెన్స్ కి సినిమా పట్ల మంచి ఇంటరెస్టింగ్ క్రియేట్ చేస్తుంది.

తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ మరియు రోల్ కెమెరా యాక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్న తరుణం లో ఈ సినిమా యూనిట్ డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి కెమెరా జై పాల్ రెడ్డి, ఆర్ట్ మధు రెబ్బ, ఎడిటింగ్ సాయి తలారి, సంగీతం అనిల్ గోపి రెడ్డి, మాటలు వేణు రాచెర్ల, కథ కథనం స్క్రీన్ ప్లే దర్శకత్వం అనిల్ గోపిరెడ్డి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *