‘సీత… రాముని కోసం’ పాటలు విడుదల

‘సీత… రాముని కోసం’ పాటలు విడుదల

‘సీత… రాముని కోసం’ శ్రీరంగం శరత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా సిని ప్రేక్షకులలో రోజు రోజుకి సరి కొత్త అంచనాలు సృష్టిస్తూ డిసెంబర్ రెండో వారంలో విడుదలకు ముస్తాబు అవుతుంది.  అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ శ్రీరంగం మరియు కారుణ్య లు నటినటులుగా నటిస్తుండుగా, తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ మరియు రోల్ కేమెరా యాక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ముద్దుల కూతురు మరియు హీరొయిన్ నిహారిక ఇటీవల ఈ చిత్ర ఆడియో ని విడుదల చేసారు.

నిహారిక మాట్లాడుతూ ‘’సీత చాలా మంచి టైటిల్, సినిమా కూడా అంత మంచి విలువలతో ఉంటదని నమ్ముతున్నాను. హారర్ సినిమాలు అంటే నాకు కొంచెం భయం. అయినా కాని అభిమానులతో పాటు నేను కూడా ఈ సినిమా ఏప్పుడేప్పుడు చూద్దామా అనే ఏదురు చూస్తున్నాను. హీరో శ్రీరంగం శరత, కారుణ్య, అనిల్ లుక్స్ బాగున్నాయి. చిత్ర యూనిట్ కి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపారు నిహారిక.

చిత్ర యూనిట్ మాట్లాడుతూ మనిషికి, మనిషి మరణించిన తరువాత రూపాంతరం చెందే ఆత్మకు మధ్య గల ఒక బంధాన్ని ఈ సినిమాలో సరికొత్తగా అవిష్కరించాం అని తెలిపారు. వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు ఆత్మలు ఉన్నాయా..? లేవా..? అవి వట్టి ఉహగానాలేనా…? మనిషి, ఆత్మ, ప్రేమ, మానవ సంబంధాలు, ఏమోషణ్ అనే అద్భుత స్క్రీన్ ప్లే తెరకెక్కిన ఈ సినిమాకు కెమెరా జై పాల్ రెడ్డి, ఆర్ట్ మధు రెబ్బ, ఏడిటింగ్ సాయి తలారి, రచన దర్శకత్వం అనిల్ గోపిరెడ్డి. విడుదల డిసెంబర్ రెండో వారం.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *